నేనే నీవైన వేళ
నేనే నీవైన వేళ
నేనే నీవైన వేళ
నిన్నటి నేను నేడు లేను….
నీలో నన్నే చూసానేమో?
దగ్గరై పోయాను....
నాకు తెలీకుండానే ..!
భావాల పరంపర క్రమేపి మారిపోతుంటే...
అణగారిన ధూపములా
మిగిలిపోతానేమో ....!
నేనంటు లేకుండ పోయినపుడో??
నా మనుగడ తాలుకు గుర్తులు
నీ చుట్టూత......
కమ్ముకోకుండ......వుండేలా..
చేసుకోగలవా ?
ఏదో ఒక మూల......
మది అంతరాలలో...!
గమ్మత్తుగ చుట్టుకొని పోయి
వుంటానులే!!
వీడలేనుగా నేనే నువ్వైనపుడు .......!!

