నేలతల్లి
నేలతల్లి
కళ్ళు నీటి చెలమలయ్యాయి ...
నేలతల్లి
గుండె పగుళ్లు చూసి ...
కనికరించని కాలం
కసి కట్టింది
కరువును పసిగట్టి ...
గుక్క పట్టి ఏడ్చే పసిపాపకు మల్లే...
రైతన్న ప్రాణం గిజగిజలాడింది ...
చెట్టూ పుట్టా వెతికి అలసిపోయాయి పక్షులు ...
తిండి గింజలు కరువై ...
కడుపు నిండే మార్గమేదీ ...?
కలలు కల్లలైపోతోంటే
పేకమేడలై కూలుతుంటే ...
ఆకాశం నిండా మబ్బులు ...
ఎండమావుల్లా ఊరిస్తూ ...
దాహం తీరే మార్గం మాత్రం శూన్యం ...
ఏ తీతువు కూసిందో ...
ఏ జిల్లేడు పూసిందో ...
గబ్బిలాలు తిరుగుతున్నాయి పాడుబడ్డ గోడల్లో ...
అక్కడ కరువు తాండవిస్తోంది ...
ఆశ చూపే మేఘం
రిక్తహస్తాలతో ఆహ్వానిస్తోంటే ...
చిరుచినుకులు కూడా కరువై మనస్తాపాన్ని పెంచుతుంటే ...!!
