STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

నైతిక విలువలు

నైతిక విలువలు

1 min
15

నైతిక విలువలు.
(తేటగీతి పద్యములు)

నైతికంబగు విలువలు నరుల యందు 
మృగ్యమై పోవ జాతికి మేలు కలదె?
పసుల రీతిగా మనుజులు బలము తోడ 
నీచులై వర్తిల్ల సంఘము నిలుచు టెట్లు?

లోక మందున ధర్మము లుప్తమాయె.
ఘోర మైనట్టి బుద్ధితో కూళలిపుడు 
సాటి వారిని హింసించ శాంతి కలదె? 
స్త్రీల భద్రతన్ శోచింప దిగులు పుట్టు.

పాలు గారెడి బిడ్డలన్ వదల రకట!
దారితప్పిన మనుజులు దయను వీడి
రాక్షసుల వోలె నడయాడ రాత్రి పవలు
కాల మెవ్విధి సజ్జనుల్ గడుపవలయు?

ప్రభుత నడిపెడి పాలకుల్ ప్రజల కొఱకు
కఠిమౌ చట్టముల్ చేసి గమనికమెయి
దుష్ట సంతతిన్ బలిమితో దునుము చుండ
సంఘ మందున విలసిల్లు శాంతి యెపుడు.

తల్లి దండ్రులు గురువులు తగిన యటుల
మంచి వారిగా బిడ్డలన్ బెంచవలయు.
సాధు సజ్జనుల్ ప్రజలకు సామగతిని
నేర్పు చుండిన విలువలన్ మార్పు కలుగు.//

టి. వి. యెల్. గాయత్రి


Rate this content
Log in

Similar telugu poem from Classics