STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Romance

4  

Venkata Rama Seshu Nandagiri

Romance

నాట్యరాణి

నాట్యరాణి

1 min
324

అందానికి రతీదేవిలా

నాట్యకళలో ఊర్వశిలా

నటరాజుకి శిష్యురాలిలా

మదిని దోచే నాట్యరాణిలా

నీ అందమే మదిని దోచేను బాలా

నినుచూసి నీపై మరులు కొంటి బేలా

శరాఘాతములే నీ చూపులు

మరేల బాలా, ధనుర్బాణాలు

వశము చేసెనే ముక్కంటిని నీ సుమశరాలు

ఏల బాలా మాపై, వాలు చూపుల తూపులు

సుమశరుని పై చూపుమా నీ మరులు

తాళగలమా మేము నీ శరాఘాతాలు

ఆచ్చెరు వొందిరచ్చరలు నీ నాట్యము గని

మానవ మాత్రులము, మేమెంతవారమని

నిను గని పరవశమందె మా మానసములు,

ఓ నాట్యరాణీ, నీకు శతకోటి వందనములు.


Rate this content
Log in

Similar telugu poem from Romance