నాటి లేఖ
నాటి లేఖ


నా మది లో ఉన్న ఆలోచనలకు ఆనకట్ట లేక...
ప్రవహిస్తున్న నీరు వంటివి నా మాటలు.
రూపం లేని నా శిల లాంటి హృదయానికి
రూపం దాల్చడానికి నీవు శిల్పి వై ఉండాలి
నిశ్శబ్దంగా ఉన్న కొలనులో వెన్నెల వెలుగులకు తామరలు విరబూసినట్లు..
నామది లో నీ వెలుగుకు ఈ నా కవిత వికసించింది.
సముద్ర కెరటాలు ఆకాశాన్ని తాకాలనే తపన లాంటిది నా తపన
నా ఆవేదనను ఎవరితో పంచుకోలేక..
క్షణమైన నిలువని నా మనస్సు
నీ ఎదుట ఓ క్షణమైన నిలవదా అని ఆశిస్తూ..