నాతో మాట్లాడవా
నాతో మాట్లాడవా
" నాతో మాట్లాడవా??? " - రాజేష్ ఖన్నా
==============================
నీకు అక్కరకు రానని
నీకు అవసరం కానని
నీకున్న అందరిలో నేనేం కానని
గతిలేని స్థితిలో ఉన్నానని
నడివీధిలో నన్నెరుగకా
నడిరాత్రికి గోప్యoగా
కలువడానికొస్తావా?
నీవు రాకపోయినా నేనేం అనుకోను
కానీ వచ్చి మాట్లాడకపోతేనే బాధ
దూరంగా ఉన్నా తట్టుకోగలను
కానీ దగ్గరికొచ్చి దూరం పెడ్తేనే భరించలేను
నీవు తిట్టినా ఓర్చుకోగలను
కానీ నీ మౌనంలోని బాధని ఊహించలేను
అయినా దూరమెందుకు
నా గుండెకి ఈ తెలియని భారమెందుకు?
నన్ను ఏడిపించాలన్నా, నవ్వించాలన్నా
చివరికి అంతా నీ ఇష్టమే అయిందిగా
నాకు కలలు కనే స్వేచ్ఛకూడా లేకుండా
నా ఊపిరిని సహితం బంధిస్తే ఎలా
నా కష్టాల్లో తోడురాకుండా,
నా భయాల్లో నీడగా మారకుండా
నా జీవితాన్ని కూడా లాక్కుపోతే ఎలా
తెలివిలేనితనంతో నా మనసుని తేటతెల్లం
చేసుకొని, నీ కోసం రాని వేషాలు వేసుకొని
నా మనసుని చంపుకొని పలకరిస్తవానే ఆశతో
నీకోసం వెయ్యికళ్ళతో వేచి చూస్తుంటే
నిలకడలేని జీవితమని
నడివీదిలో నన్ను నిలబెట్టి
నిష్కారణంగా మాట్లాడకుండా
వెళ్లిపోవడం నీకు తగునా?.
అయినా తిరిగిరాని ప్రేమలకోసం
తిక్కకుదిరేదాకా, తిన్నది అరిగేదాకా
పాడేమీదా నాకు తిలకం దిద్దేదాకా
వెర్రివాడిలా వేచిఉండలేను
ఈ లోకంలోకి వెలుగులు రాకముందే
నేను కూర్చొన్నచోటికి వెగటుపుట్టకముందే
లేడిలా లేచి పరుగులు తీయబోతున్నా
ఎగసే కెరటంలా ఎగిరి గంతేయ్యబోతున్నా
పక్షిరాజు రాబంధులా నింగినందుకోబోతున్నా
అప్పుడు కూడా నాతో మాట్లాడావేమో చూస్తా...
నీవొచ్చి నన్ను వేడుకొంటూ నాతో మాట్లాడవా
అనడిగేలా చేసి చూపిస్తా.....

