నారీ ప్రవాహం
నారీ ప్రవాహం
అనాదిగా అణచబడి
నెలనేసి తొక్కుతున్నా
జారుతున్నట్లనిపిస్తున్న
కాలుతున్న లావానినేను
కలలా కనిపించనట్లనిపించి
ఊహల్ని అలలా కదిలించి
ఒదిగున్న నదిలా మెలిదిరిగి
ప్రవాహంలా సాగిపోతాను
నన్నాపాలని యోచించి
అంతలోనే తొందరపడి
అమాంతంగా అడుగిడితే
మరి కొట్టుకుపోవాల్సిందే
