STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నాలో నీ తోటి

నాలో నీ తోటి

1 min
3


ఎప్పుడో కనిపించి..నవ్వేసి వెళ్ళావు..!

దరిచేర పిలువగా..మాయమై పోయావు..! 


ఈ బ్రతుకు నిజముగా..ఒకగొప్ప క్రీడలే..

ఊహలో శతకోటి..మెఱుపులే నింపావు..! 


ఈ తనువు పావుగా..చదరంగ మేమిటో.. 

అశ్రవను కోటలో..బందీని చేశావు..! 


ఏ పూల జల్లులో..నీ అడుగు జాడల్లొ..

గంధాల వానలో..తడపకే తడిపావు..! 


భావాలు ఏవైన..మాటలే కరువులే.. 

చిత్రమీ నాటకం..ఎఱుకలో నిలిపావు..! 


స్వప్నాల భువనాలు..కూల్చేయు నేర్పరివి..

నాలోని నీతోటి..తియ్యగా కలిపావు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance