నాకు నువ్వు నీకు నేను
నాకు నువ్వు నీకు నేను
కోపంపై కోపానికి కోపమొస్తె మంచిది కద..!
ప్రేమకు అర్థం మౌనంలో ఉంటుంది కదా..!
స్నేహానికి పరమార్థం చిరునవ్వున దాగుంది కదా..!
నీవునేను ఒకటైతే ఉన్నహాయి పాపం ఆ కోపానికి ఏంతెలుసు..!
దాని మొహం ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఏంటి సాధిస్తుందట..!
ఎవరు సెలవు పెట్టగలరు కోపానికి అందంగా..!
మన నడుమన దానికెందుకు చోటసలు..!
నాకు నీవు నీకు నేను..దానికెందుకు మనతోడు..!
కుతకుతమను దాని మనసు చల్లబడదు ఎన్నటికీ..!
మంట పెట్టి ముచ్చటేదొ చూస్తుందది చోద్యంగా..!
దాన్ని కాస్త వెలిగిద్దాం ధూపంలా..!

