నాకలలకు రూపమిడే
నాకలలకు రూపమిడే
అలసిపోని మైలురాళ్ళ..నవ్వెంతో బాగున్నది..!
పరిమళించు నీ చూపుల..మెఱుపెంతో బాగున్నది..!
ముంచెత్తే అక్షరాల..వెల్లువలో ఉంటి చెలీ..
ననుపాటగ మలచే నీ..ఒడుపెంతో బాగున్నది..!
కబురులెన్ని చెబుతావో..కన్నులెదుట పడకుండా..
వింతమాయ మోసానికి..రూపెంతో బాగున్నది..!
అడుగ నోరు మెదపలేని..పేదరికం అదేమిటో..
పేరుచెబితె వినాలనే..తలపెంతో బాగున్నది..!
ఏ సితార రాగానికి..ఏవిరహం తీరేనోయ్..
తారామణి హారం నీ..మనసెంతో బాగున్నది..!
నిదురెరుగని ఆశయాల..మల్లెతీగ మాట్లాడెను..
నాకలలకు రూపమిడే..పిలుపెంతో బాగున్నది..!

