STORYMIRROR

Radha Krishna

Tragedy Classics Others

4  

Radha Krishna

Tragedy Classics Others

నాకే ఎందుకిలా...!!

నాకే ఎందుకిలా...!!

1 min
299

నిన్న వదిలి వెళ్ళావు

నేడు తిరిగి వచ్చావు

కానీ మౌనంలో మునిగావు..!!


పక్షిలా విచ్చుకుని ఎగిరావు

రెక్కలు తెంచుకుని వచ్చావు

కానీ నాకు దూరంగా నిలిచావు..!!


చుక్కలా వెలిగావు

ఉల్కలా రాలావు

కానీ బడబాగ్నిలా మారావు..!!


శిశిరంలా వెళ్లావు

వసంతమై వచ్చావు

కానీ గ్రీష్మాన్ని చూపించావు..!!


ఎందుకిలా....

నాకే ఎందుకిలా....

ఎన్నో మలుపులతో...

నాకై నన్ను ఏమీ లేనిదానిలా చేశావు..!!

ఎందుకిలా...

నాకే ఎందుకిలా...!!

RADHA ©



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy