STORYMIRROR

Srinivasa Bharathi

Drama

3  

Srinivasa Bharathi

Drama

నాగలి.......శ్రీనివాస భారతి

నాగలి.......శ్రీనివాస భారతి

1 min
236

అవి రెండు

అన్నీ చూస్తుంటాయి

కానీ మాటాడలేవు

తృప్తిని మాత్రం అనుభవిస్తూ

ఇది ఒకటే

వాసనంతా దానిదే

కానీ చెప్పలేదు

ఆనందం అవధులు దాటి

పొంగి పొర్లిపోతే

వర్ణించడం ఎవరికి సాధ్యం

బీడు భూమిని సేద్యం చేసే నాగలి

మొలకల్ని ప్రేమగా చూస్తూ

ముత్యాల చెమట బిందువుల్తో

మొత్తం తడిపేసింది

కొండలు రెండిటి మధ్య

కొత్తగా వచ్చిన సూర్యుడు

నవ్వుతూ పలుకరిస్తున్నాడు

అడ్డుకట్ట వేయనందుకు

వర్షం హర్షం కలిగించేలా

భూమిలోపలికి ఇంకుతోంది

ప్రకృతి అందంగా పరవశిస్తోంది...

---------****************---------------



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama