నాదజయే
నాదజయే
ప్రతిభా'వం ప్రవహించే..నిజ ఊహల జ్ఞానజయే..!
అల్లుకున్న 'నేను'చెలియ..వర్షించే క్షీరజయే..!
పదముగనో పాటగనో..ఉదయించే కిరణధునియె..
నీ చుట్టూ లోకాలను..అలరించే నాట్యజయే..!
అక్షరాల సౌందర్యపు..గంధాలకు లొంగనిదే..
నిత్యమౌన వాహినియౌ..దివ్యగగన శూన్యజయే..!
భువనాలకు విందుచేయు..సంగతియే మనోహరం..
సాక్షియైన తపోవనపు..కవనభాను కావ్యజయే..!
సత్యస్వర్ణ కమలాలయ..నివాసినీ హాసమదే..
విశ్వాలకు స్వరాతీత..గానమయే ధీ'రజయే..!
సృజనాలయ విన్యాసపు..సొబగులీను పరాశక్తి..
సంశోభిత ప్రణవామృత..ధారాంతర నాదజయే..!
