నాడు నేడు
నాడు నేడు
నా మనసు ఈరోజు ఎందుకు ఇంత
ఉల్లాసంగా ఉంది అనుకున్నా..
అందుకు కారణం నువ్వే అని తెలుసుకోలేక
పోయా నువ్వే నాలో ఉన్నది అని...
అందుకే ఏమి మనసు నీ జ్ఞాపకాలతో
పరవళ్ళు తొక్కుతూ పులకించి పోతుంది...
అందుకే నేను ఎప్పటికీ నీలోనే ఉండాలి నీ
ప్రతి అణువులో మిళితమై పోవాలి అని...
నీ పాపిడి మధ్యలో తిలకం నేనే కావాలి
నీ నుదుటి బొట్టును నేనే కావాలి....
నీ గుండెలపై వేలాడే తాళిని నేనే కావాలి
దానికి బాధ్యత నాదేకావాలి...
నీ నవ్వు నేనే కావాలి నీ ఆలోచన నేనే కావాలి
నీ శ్వాసను నేనే కావాలి...
నీలో దాగిఉన్న ప్రతిది నేనే కావాలి అవి లేని
నాడు నేనే శూన్యం కావాలి...
..
సిరి ✍️❤️

