నాదైన జీవితం
నాదైన జీవితం
నాదైన ఒంటరి లోకాన్ని వదలి బయటి ప్రపంచాన్ని చూడాలని
నాలోని చిలిపితనం చూడమంటున్నది పెద్దరికాన్ని పక్కనబెట్టి
పరిధిలో ఉంటే లోకం తెలీనిది ఏమున్నది బయటన
నేననుకున్నట్టు పూల వర్ణాలకు పులకరించే వారు సీతాకోకలను
పలుకరించేవారుండరు
నిశితంగా గమనిస్తే స్నేహం చాటు నమ్మకద్రోహం
అర్ధం చాటు పరమార్ధం బోధ పడుతుంది.
నేనేమో పూలకుండీలలో పెరిగే మొక్కలకు నీరుపోస్తుంటాను
బయట వేళ్లూనుకున్న స్వార్థం విషపు పండ్లను నీకందంగా చూపిస్తుంది
చూస్తే చూసావు వెనుకకు మరలి మంటూ మనసు చెబుతున్నా
ఆగాను ఒకచోట!
తను తింటున్న మిఠాయిని ముసలివానికందిస్తున్న పాపాయి
తూనీగలకై పరిగెడుతున్న పిల్లవాడు
పిల్లవాని నవ్వు లకు మురిసి పోతున్న అమ్మ
చెట్లపువ్వులకు ఫోటో తీస్తూ యువకుడు
.......
ఉన్నారు నాలాంటి వారు లోకంలో
నేనే కాదు నాలాగే
నే ఒంటరిని కాదు
బయటకు వెళితే
అంతా బంధుజనమే
వెళ్లేదా?
