నా వలపు దీపాలు
నా వలపు దీపాలు
నా వలపుల దీపానికి నీ ఊసే ఊపిరి కద..!
గుండెలయల స్వర్గానికి నీ తలపే ఊపిరి కద..!
మనసుతలుపు మూయలేను కలనైనా నీవు రాక..
ఈ మల్లెల రాజ్యానికి నీ స్పర్శే ఊపిరి కద..!
వెంటాడే విరహాలకు విరహగంధమిచ్చేవే..!
నులివెచ్చని మేఘానికి నీ ఊహే ఊపిరి కద..!
మెరుపుపూల వనమేదో వరమైనది నీ చలువన..
ఈ వసంత నాట్యానికి నీ వెలుగే ఊపిరి కద..!
సమయమాయ ఏమున్నది సాక్షియైన వేళలలో..
అమృతవరద కాలానికి నీ పథమే ఊపిరి కద..!

