STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

నా ఊపిరి

నా ఊపిరి

1 min
1


కళ్ళు చూస్తున్నాయి, జీవం లేని చూపులు కొన్ని

కనుసైగలు మంచికో, చెడుకో చెప్పలేం

మాట తూలడం, తప్పడం అలవాటైన నాలుక

రెండు చెవులు వింటాయి బుద్దిగా

విన్నవి నిలకడగా ఉంటాయా అడుగొద్దు

తాను ప్రాణవాయువు పిలుస్తూ ముక్కుపంచేదేమిటి

మెదడులో ఆలోచనల పరంపర

లోలకంలా కాదు నాలుగు వైపులా ఊగుతున్నాయి

ఎటువైపు మల్లుతాయో, ఏ దారి ఎంచుకుంటాయో

భయం లేని బాతు బజార్లో గుడ్డు పెట్టినట్లు క్రియ

మనసు పొరల్లో పారే దుమ్మును దులుపుకోకపోతే

ఊపిరుంది చైతన్యముందా లేదా అన్న ప్రశ్న


చైతన్యమే నా ఊపిరి పిడికిలెత్తి చెప్తారు

బల్ల గుద్ది, మైక్ అదరగొట్టే ప్రసంగాలు

కర్ర విరగదు, పాము చావదు పద్ధతి ఆచరణ

నువ్వు కోప్పడు నేను ఏడ్చినట్లు నటిస్తా

వేదికలపై తిట్టుకోవడం రాత్రి కలిసి మందు కొట్టడం

ఇవన్నీ చైతన్యరహితమనలేం, అలాగని ఒప్పుకోలేం


చైతన్యమే మన ఊపిరైతే

కళ్ళల్లో వెలుతురుండాలి

నోరు ప్రేమను పెంచాలి

శ్వాస చెట్టుగా మారాలి

చేసే పని ఏదైనా చెరువులా ఉపయోగపడాలి

ముత్తడి దుంకే మాటలు మరో చెరువు నింపాలి

అంతెందుకు మనం చనిపోయినా

ఎండిన చెట్టులా ఆదర్శం కావాలి


Rate this content
Log in

Similar telugu poem from Classics