STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

నా ప్రేమ నిత్య నూతనం

నా ప్రేమ నిత్య నూతనం

1 min
460

నీ రూపం కళ్ళనిండా,

నీ ఊహలు మనసునిండా,

నీ మీద ప్రేమ హృదయం నిండా,

నింపుకొని..

నీ రాక కోసం ప్రతీరోజు ఎదురుచూస్తాను.

ఏ చెట్టు.. పుట్ట.. గాలి.. నీవు వస్తున్నావన్న జాడ తెలుపదు.

నిన్ను చూస్తే నీ కోసమే బతకాలి అనిపిస్తుంది. నీ ఆలోచన వస్తే నీతోనే ఉండిపోవాలి అనిపిస్తుంది.. నీ ప్రేమ లో భావాలు..అక్షరా లై. పదాలయి... కవితలై.. కథలై.. మదిని ముంచేస్తాయి..

 కానీ నువు రావు. నా బాధ తీరదు..

విరహవేదనతో నాలో నేనే దహించుకుపోతున్న.. బయటకు రాని కన్నీళ్లతో విలపిస్తున్న..

కాలం గడిచిపోతుంది నువు రావు..

నాకు నిన్ను చూడాలన్న ఆశ చావదు.

నిద్రపోయేముందు పక్కనే ఉన్నావనే భ్రమలో ఉంటాను

అర్ధరాత్రి గుర్తు వస్తావు లేచి కూర్చుంటాను. మళ్ళీ నా కనులను నిద్ర ముద్దడాలంటే..

కనిపించని నీ ఆలోచనలతో నేనొక యుద్ధం చేయాలి.

అయిన నీ మీద నా ప్రేమ నిత్య నూతనం.. శాశ్వతం..

నాకు నువు ఒద్దు.. నీ ప్రేమ ఒద్దు.. నా ప్రాణం కూడా ఒద్దు.. వెళ్ళిపోతాను..నీ ఆలోచనలు నన్ను చేరనంత దూరం.. నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడనంత దూరం వెళ్ళిపోతాను.

శ్రీ...

హృదయ స్పందన.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance