STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ప్రాణం...

నా ప్రాణం...

1 min
349

నీ నీలి కళ్ళ అగాధాలు

నీ చిలిపి కనుల పరాచకాలు

నీ నవ్వుల తుళ్లింతలు

మరువలేను నేస్తం నా ప్రాణం పోయిన


నీవు చేయి వదిలిన ఆ క్షణం 

కనులు తిప్పుకొన్న వైనం

తిరిగి చూడకుండా వెడలిన ఆ తరుణం

మరువలేను నేస్తం నా ప్రాణం పోయిన


వర్షం లో నీ సయ్యాటలు

ప్రతి మాటలో నీ వలపు తుళ్ళింతలు

నీ చిన్న పిల్లల చేష్టలు

ప్రేమిస్తూనే ఉంటాను

నా ప్రాణం పోయిన


నీ వగపు మాటల మూటల్ని

అరని మంటల కలల్ని

నన్ను నాకే దూరం చేసిన నీ ఊహల్ని

మరువలేను నా ప్రాణం పోయన...


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance