నా ప్రాణమా
నా ప్రాణమా
నా ప్రాణమా
నీ ఆలోచనల నీటిలో కాలాన్ని కరిగిస్తున్నాను
నీ ఊహల సువాసనలను పీల్చుతున్న
నీ ఊసుల అత్తరు చల్లి
నా రాతిరి నిద్దుర దొంగలించావ్
ఊహల జగతి లో నన్నే ఊరేగించావ్
నాదైనా నా లోకం లో నాదంటూ ఏమి లేదని నువ్వే అలుముకున్నావ్
నన్ను నాకై నన్నే తిరిగిచ్చేయ్ ప్రాణమా
ఆ ప్రాణం పోయినా నీ నీడ ను కూడా విడను

