STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

3  

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

నా పేరు మహారాష్ట్ర

నా పేరు మహారాష్ట్ర

1 min
202

నా పేరు మహారాష్ట్రం

నా రాజధాని ముంబయి నగరం అతిపెద్ద నగరం.

నా అధికార భాష మరాఠీ

నేను వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం,

నేను జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం. 

నన్ను గత చరిత్రలో "దండకారణ్యం" అనేవారు


నా ముఖ్యమైన పండుగలు: గుడి-పాడ్వా, దీపావళి, రంగపంచమి, గోకులాష్టమి, వినాయక చవితి ఆషాఢమాసంలో పండరీపూర్‌కు వందలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం సంప్రదాయం.


నా ముంబాయి నగరాన్ని భారతదేశానికి ఆర్థిక రాజధాని, సినిమా రాజధాని అంటారు. 


నా నగరం ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది ఆసియాలో అత్యంత పురాతనమైనది.


నేను దేశంలో బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తు ,అణు విద్యుత్ ఈ రెండింటిలోనూ నాదే అగ్రస్థానం


నా జాతీయ ఉద్యానవనాలు

గుగమల్ నేషనల్ పార్కు, (మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ )

నవీగావ్ నేషనల్ పార్కు 

పెంచ్ నేషనల్ పార్కు (టైగర్ ప్రాజెక్టు)

సంజయ్ గాంధీ నేషనల్ పార్కు (బోరివిలి నేషనల్ పార్కు) తడోబా అంధారి టైగర్ ప్రాజెక్టు 


నా ముఖ్యమైన పరిశ్రమలు:

రసాయన, అనుబంధ పరిశ్రమలు

విద్యుత్ పరికరాలు, యంత్రాలు

యంత్ర భాగాలు, వస్త్ర పరిశ్రమ

ఔషధాలు, పెట్రోలియం ఉత్పత్తులు,పానీయాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్ ఉత్పత్తులు


నా ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు: మామిడి, ద్రాక్ష, నారింజ, వరి, గోధుమ, జొన్న, సజ్జ, పుగాకు

పప్పు ధాన్యాలు, వేరు శనగప్రత్తి, చెఱకు, పసుపు, 


నా నగరంలో మూడు నౌకాశ్రయాలు - ముంబాయి, నవసేన, రత్నగిరి ఉన్నాయి

నా నగరంలో పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. నా పూణే, నాగపూర్‌ల‌లో కూడా చిన్న అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. 

నా నగరాలు రత్నగిరి, కొల్హాపూర్, నాశిక్‌లలో విమానాశ్రయాలున్నాయి. 

నేను ఫెర్రీ సర్వీసుల ద్వారా తీర ప్రాంత పట్టణాల మధ్య ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి. 








Rate this content
Log in

Similar telugu poem from Abstract