నా మనసును
నా మనసును
చిరు నవ్వుల జాబిలిగా చేసినావు నా మనసును..!
మరు మల్లెల పందిరిగా మలచినావు నా మనసును..!
పసిడి వన్నె మేనాగా నా తనువే వెలుగుతోంది..!
వసి వాడని సుమవనిగా మార్చినావు నా మనసును..!
సంపెంగలు తెస్తావని నా కురులే కనులైనవి..!
అలుకెరుగని హిమగిరిగా నిలిపినావు నా మనసును..!
నా గాజుల ఊసులలో మైమరచెను సొగసులన్ని.. !
పరవశించు రసధునిగా తీర్చినావు నా మనసును..!
అధరయుగళి పాడుతున్న మౌనగీతి సాక్షి కాగ..!
కలరవముల వరనిధిగా కూర్చినావు నా మనసును..!

