నా మనసు...
నా మనసు...
రాయి వని తెలిసి
దేవుడవని పూజిస్తున్న నామనస్సుకు
నీవు రావని ఎలా తెలుపను.....!!
వరములివ్వవని తెలిసి పువ్వులన్నీ
నీ పూజకే అర్పిస్తున్నా నామనస్సుకు నా పూజలు వ్యర్థమని ఎలా తెలుపను!!
చదవలేవని తెలిసి కవితను నేనై నిత్యం నీఆలాపనతో రచిస్తున్న నా కవితలు నిరాదారాలు అని ఎలా తెలుపను...!!
దాహం తీర్చలేవని తెలిసి కూడా నీఊసులు కన్నీటి జలపాతాలు గా గుండెకు అందిస్తూ ఉంటే తడి అరని కన్నీటి జలపాతం నీవని ఎలా తెలుపను.....
మరపు మనిషికి వరమయితే
మరచిపోలేక పోవడం శాపమని
నామనసుకు ఎలా తెలుపను.....

