నా మది...
నా మది...
నిదురలో కలవై...
మెలుకువలో కలవరమై...
నడకలో నీడవై...
మాటలో తడబాటువై...
మౌనంలో యెడబాటువై...
గానంలో చేరువై...
గుండెలో రంపపుకోతవై...
కాయమే భారమై...
శూన్యమే సొంతమై...
నన్నీదరినే వదిలిపోయావు...
పోరాడి అలిసిపోయాను...
విశ్రాంతి కోరుతుంది...
నిదురన్నది మరచిన నామది...

