నా కలం సిరా
నా కలం సిరా
ఇవాళ నా కలం
ఎందుకో వేగం పుంజుకుంది
పదాల వేటలో
పరుగులు పెడుతుంది
పదాలతో పదనిసలు
పలికించాలని నన్ను నేను
ఎన్ని సార్లు గాయపడ్డానో..
ప్రతీ కవనంలో
పదాలు పడే తపన
ప్రసవ వేదన అంతా ఇంతా కాదు
అంతరంగం పడే
వేదన లోంచి పదాలు
పరవళ్ళు తొక్కుతాయి
భావాలు పరవశించి
పొంగి పోతాయి
తీయని మధురిమలను
పలికిస్తాయి
మెదళ్ళ కుదుళ్ళలో
చొరబడి కలబడి మెలిపడి
పెదాల కట్టలు దాటుకుని
ఉరకలు పెడతాయి
కలం సిరాలో చొరబడి
మనసు కాన్వాసుపై
నాట్యం చేస్తాయి
బిగపట్టిన ఊపిరి
తేలికపడినంత భావన
నాలో కలిగి
గాలిలో తేలినంత హాయినిస్తుంది
