STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా గుండె లో ఉప్పెన

నా గుండె లో ఉప్పెన

1 min
401

ఎందుకో నీ నవ్వు నిన్న లా లేదేంటి!

 గుండె లో ఉప్పెనకి ఆ పసిడి ముసుగేంటి !


 కన్నీటి ప్రమిద లో చిరునవ్వు దీపాలు

స్వప్నాల తేరులో ఈ వింత గుబు లేంటి!


ఓటమికి లోంగితే జీవితం శూన్యమే

మనసులో కారడవి మంటలకి కొలు వేంటి!


ఎవరెన్ని అను కున్న నిజమేగ మిగిలేది

నిను కలిచి వేసినా ఆ నీడ ఋజు వేంటి!


 గత మెంత నలిగిందొ స్వార్ధాల కొలిమి లో

గాలిలో బరువైన ఈ వింత దిగులేంటి!


కాలమే మధు పాత్ర గాయాల సుధ యాత్ర

అందాల సీమలో ఈ కలత ముసురేంటి!


Rate this content
Log in

Similar telugu poem from Romance