నా గుండె కడలిలో
నా గుండె కడలిలో
నీ చిన్ని నవ్వుతో మురిసేను లోకాలు..!
నీ కంటి చూపుతో విరిసేను విశ్వాలు..!
సెలయేటి పాటలకు స్వరములే కూర్చేవు..!
నీ మౌన దీప్తితో కురిసేను మేఘాలు..!
వెన్నెలకు స్వప్నాల వనములే చూపేవు..!
నీ పలుకు ధారతో..పొంగేను రాగాలు..!
ఏ కణము కాకణము..శతకోటి వీణలై..
నీ వేణు రవముతో..పంచేను స్నేహాలు..!
నా గుండె కడలిలో..అలజడులు మాన్పేవు..!
నీ అడుగు జాడతో..తొలగేను దాహాలు..!

