నా దేశం..నా గర్వం..
నా దేశం..నా గర్వం..


ఎన్ని భాషలు..
ఎన్ని మతాలు...
ఎన్ని వర్ణాలు..ఎన్ని ప్రాంతాలు..
అన్నీ కలగలిసిన ఒక అద్భుతం నా దేశం.
ఎన్ని పండుగలు..
ఎన్ని ఆచారాలు..
ఎన్ని సంస్కృతులు..
ఎన్ని రీతుల ఆత్మీయ అనుబంధాలు..
ఇదికదా నా దేశపు ముఖపరిచయం.
ఇన్ని వివిధతల కదంబ పరిమళం..
ఎన్నో తరాల అనుభవసారం..
సున్నిత భావాల అద్భుత సమాగమం..
భిన్నత్వంలో ఏకత్వం..
ఎన్ని యుగాలకైనా ..
ఈ నా దేశం..నా గర్వం.