నా డైరీలో ఒక పేజీ
నా డైరీలో ఒక పేజీ
అనుకోలేదు ఇలా, నా భావాలని ఒకరితో పంచుకోడానికి లేక,
ఇలా నా డైరీలో రాసుకుంటానని..
అనుకోలేదు ఏనాడు, అందాల సందడిలో సవ్విడి చేస్తూ లోకం మునుగుతుందని..
అనుకోలేదు, మంచి మనసుకి ఎప్పుడు బాధే కలిగిస్తారని..
అనుకోలేదు, స్వేచ్ఛగా ఎగరాల్సిన పక్షి రెక్కలు విరిచేస్తారని..
అనుకోలేదు అసలు, మన కష్టాల్లో తోడు ఉండాల్సిన వాళ్ళు కనుమరుగైపోతారని..
అనుకోలేదు అలా, నిజాన్ని ప్రశ్నించే గొంతుని నులిమేస్తారని..
అనుకోలేదు, నా అనుకున్న వాళ్ళే నా మీద నమ్మకం కోల్పోతారని.. అనుకోలేదు, ప్రశాంతంగా గడపాల్సిన జీవితాన్ని కూల్చేస్తారని..
అనుకోలేదు, నా అనుకున్న వాళ్ళందరూ దూరం అవుతారని..
అనుకోలేదు అసలు, అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతానని..
నటిస్తూ, నవ్వుతూ, సర్దుకుంటూ, బ్రతుకుతున్న నేను, జీవిత పరమార్ధాని తెలుసుకోగలిగిన, జీవితాన్నీ పరిపూర్ణం చెయ్య లేను ”
