నా చెలియ
నా చెలియ
గుండెలయల రాగాలకు..కనకాంబరి నా చెలియ..!
మౌనగగన తీర్థాలకు..హేమాంబరి నా చెలియ..!
తాను నడచు దారికన్న..పాలపుంత లేదులే..
నిత్యప్రేమ దీపాలకు..నిగమాంబరి నా చెలియ..!
ఎగిరిపోవు రాచిలుకల..పుట్టిల్లే మధురలే..
రాలుపూల స్వప్నాలకు..పవనాంబరి నా చెలియ..!
చెలిసిగ్గుల బావుటాలు..ఎగురుతున్న హంసలే..
వర్షించే మోహాలకు..మేఘాంబరి నా చెలియ..!
రజనీప్రియ గంధమేదొ..వదిలలేని తనమేల..
కలతపడే హృదయాలకు..స్నేహాంబరి నా చెలియ..!
రసరాజ్యం ఉందంటే..అంతరంగ క్షేత్రమే..
నిత్యనూత్న సరసాలకు..హాసాంబరి నా చెలియ..!
నాట్యమాడు మనోహరి..
ఏకత్వపు నాదాలకు..ప్రణవాంబరి నా చెలియ..!

