STORYMIRROR

ARJUNAIAH NARRA

Fantasy Inspirational

4  

ARJUNAIAH NARRA

Fantasy Inspirational

నా అతిధి గృహం

నా అతిధి గృహం

1 min
487

నా అతిధి గృహం..

పొద్దున్నే మంచులో

విరబూసిన మందారం

ఉదయం మోసుకొచ్చే 

ఊహల ఉసులతో

నా నేస్తంమైంది


మధ్యాహ్నం నన్ను మరిచిపోయి

మాయమైపోయే నా మరిచిక

నన్ను దూరం నుండే చూసే నా అనామిక


రాత్రుళ్ళు రసరమ్య రాగాలతో

రంజింప చేసె రమణి

రేరాత్రి వలపు విరహపు

గీతాలను వినిపించే

జాబిలమ్మమైందిI


ఓ అతిధి గృహమా !

నీ ఆతిధ్యం అపురూపం

నీ మర్యాద మరువరానిది

నీ ఒడి చల్లనిది

నీ ప్రేమ చేరుగనిది

నీవిచ్చిన జ్ఞాపకాల గనిని 

గుండెనిండా గుర్తుంచుకొని.....

నీకు ప్రేమతో విడుకోలు పలుకుతూ

వెళుతున్న.........

***********

సమీరం దూరం నుండి సినీ సంగీతాన్ని

లీలగా మోసుకోచ్చింది.

"వెళుతున్న వెళుతున్న నిన్నొదిలి వెళుతున్న

వెళ్లాలని లేకున్నా వెళుతున్న

నా మనసు నీకే వదిలేసి వెళుతున్న......

నా కన్నీళ్లను నీ వాకిట్లో వదిలేసి వెళ్తున్న.....

******* * ***** ******

     కృతజ్ఞతతో...............

     ఓ బాటసారి


Rate this content
Log in

Similar telugu poem from Fantasy