నా అన్నవారు లేని పుడక
నా అన్నవారు లేని పుడక
నా అన్నవారే లేని పుడక....
ఊహ తెలియని వయసునిస్వార్థమైన
మనసు నిర్మాల్యమైన వరస అమ్మ పొత్తిళ్ళలో ఆడుకోవాల్సిన
ఈడు రహదారి ప్రక్కన అడుక్కుంటుంది
పాలు తాగే ప్రాయంలో పైసల కోసం ప్రార్థిస్తుంది
పరుగులు తీసే పట్టణంలో పలకరింపుకై ప్రతీక్షిస్తుంది.
ఆకలేసి అమ్మా అని అరిచినా ఆశతోటి అయ్యా అని అడిగినా
పుట్టల్లో పోచే పాలు ఆ పొట్టలు నోచుకోవు
చెత్త బుట్టల్లో పారవేసే అన్నాలు పొత్తి కడుపులకు పరమాన్నాలు
నడక దారే పడక నా అన్నవారే లేని పుడక...
