మువ్వల సవ్వడి...
మువ్వల సవ్వడి...
తన పాదాలను ముద్దాడిన మువ్వలు
తన అడుగులకు వేస్తున్నాయి తాళాలు
నా యధ సవ్వడితో కలిపి పలుకుతున్నాయి స్వరాలు
తన రాకను తెలుపుతూ
నన్ను మేల్కొలుపుతూ
తన ధ్యాసను మరువనివ్వక
రూపాన్ని ముందుంచుతుంది మువ్వల సవ్వడి
కాలి అందెల మువ్వలు గల్లు గళ్లు మని శబ్దం చేస్తుంటే
నా యధలోన జల్లు జల్లు మని వణుకు పుడుతుంది.
కాలికి అందం అడుగులకు అర్థం
కాలి అడుగుల దూర ప్రయాణం ఈ మువ్వల సవ్వడి
ఏ గాలి సవ్వడి విన్నా
నీ కాలి అందెల సవ్వడేనాని
మనసు నిలవక మాట ఆడక
ఎదో వింతగా ఉన్నది రావే ప్రియా నీ మువ్వల సవ్వడి....!!!!

