మువ్వల సవ్వడి..
మువ్వల సవ్వడి..
దూరంగా వినిపిస్తోంది మువ్వల సవ్వడి
లయ బద్దంగా సాగుతోంది ఆ మువ్వల సవ్వడి
అనుగుణంగా సాగుతోంది నా హృదయ స్పందన
దగ్గరౌతున్న కొద్ది పెరుగుతోంది నా మస్తిష్కంలో అలజడి
వెతుకుతున్నవి ఎవరా అని కళ్ళు
చూడమని తొందర పెడుతోంది మనసు
చూసేదాక ఆగనంటున్నాయి కాళ్ళు
తీరా చూసే లోపు అమ్మ నిద్ర లేపింది
కళ్ళు తెరిచే సరికి కల చెదిరి పోయింది
వెన్నెల్లో ఆడపిల్లలా మిగిలి పోయింది...

