మూసిన రెప్పల
మూసిన రెప్పల
మూసిన రెప్పల..మాటున కలను..!
వాడని వెన్నెల..నవ్వున కలను..!
తరగని కలలకు..రూపము జగము..
వాడని మెఱుపుల..వాగున కలను..!
మాటకు రెక్కలు..తొడుగుటదేల..
తరగని ఊహల..మధువున కలను..!
చీకటి పంటకు..పొలముగ తనువు..
కోవెల దీపపు..వెలుగున కలను..!
మోహపు వాడకు..ప్రభువది ఎవరు..
శ్వాసల వెచ్చని..ఊసున కలను..!
లోకము లన్నియు..బంధములేను..
గంధపు తరువుల..వనమున కలను..!

