ముద్దు
ముద్దు
ముద్దు...........!!!!!!!!
మునివేళ్లపై నిలబడి అందుకున్న
అధర సంతకం..!!
ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న మధుర పంపకం..!!
ప్రణయకావ్యానికి రాసుకున్న తొలిపలుకు..!!
ఇరు హృదయాల పొంగుపోవు ప్రేమ చిలుకు..!!
కళ్ళు కళ్ళు చెప్పుకున్న గుసగుసల ఊసులు..!!
నిశ్శబ్దంగా సాగే శృంగార రచనల బాసలు..!!
మునివేళ్ళతో మీటిన శృంగార వీణ..!!
ఇరువురి తనువుల్లోపలికించెను మోహన రాగం..!!
మెల్లమెల్లగా తప్పుకోవా మొహమాటాల పరదాలు..!!
మౌనం ఇక కరిగిపోదా..!!
జరిగే ప్రేమయుద్ధం లో గెలుపెవ్వరిది..!!??
ఓటమెవ్వరిది ..!!??
అలసిన తనువులకి కౌగిలి ఒప్పందంలో తేనెలొలుకు పెదవుల సంతకాలెవ్వరివి...!!!!!!!!???????

