STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మరుమల్లెల సీమసాక్షిగా

మరుమల్లెల సీమసాక్షిగా

1 min
259

మరుమల్లెల సీమసాక్షి..చురకత్తులు బాగున్నవి..! 

చెలికురులను ప్రేమించే..విరజాజులు బాగున్నవి..! 


కురుస్తున్న వెలుగుతేనె..గ్రోలువిద్య మనోహరం.. 

నిత్యచెలిమి భావనమున..చేమంతులు బాగున్నవి..! 


ప్రియురాలిని చుట్టివేయు..సుడిగాలిగ మారుటేల.. 

తాకలేని గులాబీల..నునుసిగ్గులు బాగున్నవి..!


మరులవాన పడుతుంటే..మనసుపాట పాడునుగా.. 

గమనిస్తే చెలితలపుల..చిరుచినుకులు బాగున్నవి..!


చెలిసొగసుల కోమలతను..వర్ణించే భాషలేవొ.. 

ఊహలకే అతీతమౌ..గంధనదులు బాగున్నవి..! 


సడియెలేని చెలి అందెల..రాగాలకు స్వరములేవొ.. 

వినోదాల విందుసేయు..వింతజతులు బాగున్నవి..!


Rate this content
Log in

Similar telugu poem from Romance