మరొక్కసారి కానరావా
మరొక్కసారి కానరావా


మరొక్కసారి కానరావా!
మేఘమై మెరిసి వస్తావు
వెన్నెలై వెలుగునిస్తావు
వర్షమై హాయినిస్తావు
తొలకరి పులకరింపువో
తొలిసంధ్య కిరణ రేఖవో
ఆ నింగి నక్షత్రానివో
ఈ నేల మేలి ముసుగువో
కనుల కొలనులో కమలమై
కంటి పాపపై చిత్రమై
హృదయ వీణపై రాగమై వచ్చి
మదిని దోచిన ప్రియతమా!
ఎన్ని దినాలుగా వేచి ఉండేది
ఆ నవ్వుల నజరానా కోసం
ఆ పువ్వుల జల్లులు కోసం
ఆ మువ్వల సవ్వడి కోసం
ఆ ముత్యం మురిపెం కోసం
ఒక్కసారి మరొక్కసారి నీ
రాక కోసం...లేఖ కోసం
దిక్కులు చూస్తూ దిక్కుతోచని
నీ చకోర పక్షి ఆశలు తీర్చ
మరొక్కసారి వచ్చి పోవా
నా కళ్ళకు కాంతి తేవా!!!