Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Thorlapati Raju

Classics Inspirational Children

3  

Thorlapati Raju

Classics Inspirational Children

మరచిపోయానమ్మా..

మరచిపోయానమ్మా..

1 min
215


మరచిపోయానమ్మా!


నా వొళ్ళు సల సలా కాగినపుడు

నన్ను కంటికి రెప్పలా..

కాచిన ఆ...రోజును

నే..మరచిపోయా!


గాలిజల్లి నే నొప్పితో

బాధపడుతున్నపుడు..

నాకోసం కణకణలాడే నిప్పులపై

నువ్వు నడిచిన ఆ రోజును..

మరచిపోయానమ్మా!


నే..పరీక్షలకు భయం భయంగా

సిద్దమవుతున్నపుడు..

నీ ఉపవాసళ్తో దేవుడ్ని వేడుకున్న

ఆ రోజును 

మరిచిపోయానమ్మ.. నే మరచిపోయా!


ఉద్యోగం రాక ఏమి చెయ్యాలో

దిక్కు తోచనపుడు..

నువ్వు నాకోసం ఎన్నెన్నో..

మొక్కులు మొక్కిన ఆ రోజులు..

మారచిపోయానమ్మ..నే మరచిపోయా!


కానీ! 

అమ్మా!

నాకే..కాదు నా పిల్లల

ఆలనా పాలనా కూడా

నువ్వే చూసిన రోజున..


ఆ రోజున..

గుర్తుకువచ్చాయమ్మ..

నీ..

చాకరీలు..

ఉపవాసాలు..

ప్రార్థనలు...

నువ్వు నాకోసం చేసిన త్యాగాలు!


ఇన్ని చేసినా..

ఇప్పటికీ..నీపై

చిరాకు పడుతూనే ఉన్న..అమ్మ!

అమ్మా!

నీవే గానీ నాలా చిరాకు పడి ఉంటే

నా గతి ఏమయ్యేదో కదమ్మా!


ఈ లోకాన..

అమ్మ ప్రేమను గుర్తించకుండా

చనిపోయిన వారికన్నా ..

దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరమ్మ!


      ......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Classics