STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మోయలేని భారం

మోయలేని భారం

1 min
8

వేధించే జ్ఞాపకాల..దొంతరనే మోయలేను..! 

కాల్చేసే ఈ విరహపు..కోవెలనే నిలువలేను..! 


నాల్కచివరి తీపికొరకు..వింత ఆశ ఎందుకనో.. 

చూపలేని బలహీనత..జాతరనే ఓపలేను..! 


ప్రేమవిలువ తెలిపినావు..కనులెత్తక ప్రియసఖియా.. 

నీ సిగ్గుల పూలనవ్వు..చతురతనే కొలువలేను..! 


ఆకర్షణ శాస్త్రానికి..వ్యాఖ్యానం నీ చూపే..

నీ నడకల హొయలుచాటు..మెఱుపులనే పట్టలేను..! 


ఈ కన్నులు ఈ వీనులు..మోసమెంత చేసేనో.. 

సవ్వడులకు అతీతమౌ..వేడుకనే చూపలేను..! 


ముద్రలేవి నిలిచేనట..నీపదముల ముద్రలసరి.. 

స్వప్నించే కన్నులసిరి..పాడకనే బ్రతకలేను..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance