Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Classics

5.0  

jayanth kaweeshwar

Classics

మొగ్గలు - వచన కవితా గీతం

మొగ్గలు - వచన కవితా గీతం

1 min
376



సూక్ష్మ అంశం : “సాయీ బాబా ఆత్మీయ - అరవిరిసిన ముకుళములు”


జీవన సూచీ కారుణ్య ధామా - జీవుల దిక్సూచీ గమన సౌహార్ద్ర హృదయా 

రోగుల పాలిటి వైద్యుడవయ్యా - దురాత్ముల పాలిటి మార్గబంధు వయ్యా 

ప్రకృతి పరిపోషక సాయీరామా- బాలల పాలిటి విజ్ఞాన గణేషునివయ్యా 

సహస్ర కఱముల ముకుళిత బాబా - ఎచ్చోట ఉన్నా చేయూత నిచ్చే వయ్యా  


ఇచ్చుడేతప్ప , తీసుకొనడం లేక - దత్తావతార సమూహ పరమార్థ రూపా 

మాలిన్యము తీసేసే పరిపూర్ణ దైవానివి నీవే - పరిశుద్ధాత్మను శాంతముతో వెలిగించే దయామయుడవు కావగరావా  !!!

పరమత సహనా సాంస్కృతిక సదనా - సబ్కా మాలిక్ ఏక్ నీ నినాదా 


భక్తుల రక్షణ నీదు శిక్షణ - అదే నిన్ను చూసి ధ్యానించిన తొలగించును చింతన 

మీ కృపవల్ల భక్తులను రప్పించే దేవా - మీ అనుమతితో వారి స్థానాలకు చేర్పించేవా 

కలియుగ కల్ప తరువీవె- జీవన్ముక్తి దాతయు నీవే  నీ తలపే మా చిత్తములందున జనియించే భక్తి భావమట కాంచగా రావా !!!



Rate this content
Log in

Similar telugu poem from Classics