మనసుని వీడని
మనసుని వీడని
మనసుని వీడని గత జ్ఞాపకాలు
నీలి నీడల జ్ఞాపకాల దొంతరలో
దొర్లుతూ సాగుతున్నది కాలం
నిరంతరం నీ తలపుల వలలో
నా మది హృదయము
నీలినీడలలో సతమతమవుతూ
నీకు చేరువ కాలేని నేను
నీ కోసం మరో జన్మకి వేచిన
రాలి వాడి పోయిన పువ్వును
నేను గతమెంత గాయ పరచినా
నిను వీడని నేను అవాంతరాల
అలల హోరులో తుఫాను గాలుల్లో
కన్నీటి నదిలా సాగుతున్నా
కడలి అంతర్భాగానికి !!!!!!!

