STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసునా తనై

మనసునా తనై

1 min
6

ఒక వీడని ప్రేమరాశి..అల్లుకుంది మనసునా తనై..! 

ఒక అమృత మధురరాశి..పట్టుకుంది మనసునా తనై..!


అరకన్నుల తోటలోని..వింతలెలా వర్ణించను.. 

ఒక వెన్నెల పూలరాశి..పరచుకుంది మనసు నా తనై..!


పసిడివెలుగు తేనెజల్లు..ఒదిగే'నా మాటలలో..

నిత్యనూత్న స్నేహరాశి..విచ్చుకుంది మనసు నినా తనై..!


సంపెంగల వానలోన..ముంచెత్తే హంస కదా..

శ్రీ చందన ప్రణయరాశి..కలుసుకుంది మనసు నా తనై..!


కబురులాడు చేమంతుల..కనులలోని మెఱుపేదో..

గుండెలయల మౌనరాశి..చుట్టుకుంది మనసు నా తనై..!



Rate this content
Log in

Similar telugu poem from Romance