STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

మనసున

మనసున

1 min
1


ఆకర్షణ మంత్రమేదొ..మ్రోగే'నా మనసున..! 

మైమరపులతో'రణమే..మిగిలే'నా మనసున..! 


కిటికీలను మూయలేని..తనమేమో తెలియదు.. 

వస్తావను ఆశ అలా..వెలిగే'నా మనసున..! 


విరహమేమొ అందమైన..గులాబిలా నవ్వెను.. 

నిత్యప్రేమ సురభిళములు..చేరే'నా మనసున..! 


అగ్నివీణ ఈ తనువే..రాగాలకు బానిస.. 

నాట్యమాడు స్వరములేవొ..నిండే'నా మనసున..! 


నాది-నేను అక్షరాల..మౌనసుధగ మారగ.. 

మెఱుపుతేనె వానలోన..కురిసే'నా మనసున..! 


కోటిపూల తేఱు ఎలా..ఉంటుందో ఏమో.. 

భావగగన వీధులనే..ఏలే'నా మనసున..!


Rate this content
Log in

Similar telugu poem from Romance