మనసుకు శాంతి...
మనసుకు శాంతి...
నరాలు చిట్లిపోతున్నా కన్నీరు ఉబికివస్తున్నా
గుండెకు చిల్లులుపడుతున్నా చేతుల చేవచచ్చినా
పాదాల కదలికలే ఆగినా శరీరం నిస్సత్తువ ఆవరించినా
చిరునవ్వు చెదరనీయకున్నా నాకున్న ఆస్తులు అభరణాలూ అవేనంటున్నా
అనుక్షణం గుండెకు తూట్లు పొడిచి పొడిచి
పలుమార్లు నను చంపకపోతే ఒకేసారి చంపరాదూ
నీ కళ్ళూ చల్లబడేవి నాకీ బాధలూ తోలగేవి మనసుకు శాంతీ దక్కేవి...

