STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

మనసుకు భ్రమ నువ్వేనని

మనసుకు భ్రమ నువ్వేనని

1 min
160


ఎవరినీడ ఎదురయినా మనసుకు భ్రమ నువ్వేనని 

ఏ కదలిక కనపడినా మనసుకు భ్రమ నువ్వేనని 


చింత ఎంతొ మదినిండా నీ జాడే తెలియకుండ

ఏ గొంతుక వినపడినా మనసుకు భ్రమ నువ్వేనని 


చెప్పలేను నీ దూరం కష్టమెంతొ నా మనసుకు

ఏది తగిలి తడబడినా మనసుకు భ్రమ నువ్వేనని 


తుడవలేక పోతున్నా ఒలుకుతున్న కన్నీటిని

ఏ రూపం తచ్చాడినా మనసుకు భ్రమ నువ్వేనని 


కలనైనా నిజమునైన నన్నొదిలి పోవనుకుని

ఏ గాలీ స్పర్శించిన మనసుకు భ్రమ నువ్వేనని...




Rate this content
Log in

Similar telugu poem from Romance