మనసుకే
మనసుకే
అబద్దం హాయిగా..తోచు'నా మనసుకే..!
సత్యమే విందుగా..అందు'నా మనసుకే..!
కనులతో గొడవయే..బంధమై వీడదా..
మరిప్రేమ అసలు రుచి..అంటు'నా మనసుకే..!
మాటలే మాయగా..మోసమే చేయగా..
మౌనమే సంపదై..పట్టు'నా మనసుకే..!
తెలిసినా ఎందుకో..మానరే హింసనే..
శ్వాసకే దారమే..చిక్కు'నా మనసుకే..!
రాగమే మేఘమై..కమ్మునే చిత్రమే..
తేనెలే వానగా..నిండు'నా మనసుకే..!

