STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసుకైన గాయమెలా

మనసుకైన గాయమెలా

1 min
0

వర్ణించే లోగానే..అందమేమి అవుతున్నది..!? 

రాలుపూల రంగులలో..గంధమేమి అవుతున్నది..!?


మనసుకైన గాయమెలా..మాన్పగలవు మందులతో..

ఆవేదన ఎందుకలా!?..మౌనమేమి అవుతున్నది..!?


కాలంపై నిందవేయ..ఖర్మ ఎలా తొలగేనోయ్..

బుద్ధిపట్ల ధ్యాస నిలుప..జ్ఞానమేమి అవుతున్నది..!?


చిరునవ్వుల మెఱుపుతీవ..చివురులెన్ని తొడగాలో..

సొంతమైన ఆనందపు..దీపమేమి అవుతున్నది..!?


చర్చలతో సమస్యలేల..పరిష్కార మవుతాయో..

సంస్కారపు లోగిలిలో..స్నేహమేమి అవుతున్నది..!?



Rate this content
Log in

Similar telugu poem from Romance