STORYMIRROR

Kadambari Srinivasarao

Classics

4  

Kadambari Srinivasarao

Classics

మనసు

మనసు

1 min
266


శీర్షిక: *ఆకారం లేని అద్భుతం*


ఊహల ఊట బావి నీవు

తోడేకొద్దీ ఊరే తలపుల తుంపరకు

అంతులేని అగాధం నీవు

అహంకార జలం ఒలికించేది నీవే!

మమకార బిందువులు వెదజల్లేది నీవే!

కుట్రల కుళ్లు నీరు వడకట్టి

స్వచ్ఛమైన ఆలోచనల జలాన్ని

అందించేది నీవే!


రాగ ద్వేషాల రసమయి నీవు

కారుణ్యంలో అలరారే 

అలల నిలయం నీవు

మొగ్గలు తొడిగిన ప్రేమ కమలాలను 

పూయించే నిండు కొలను నీవు

మమతానురాగాల స్వచ్ఛత నీవు

ప్రేమించే హృదయానికి ఆదరువు నీవు


కష్టాల సుడులు కుంగదీస్తున్నా

బాధల బరువు మీద పడినా

మౌన రోదనలో హద్దు దాటని

కన్నీటి కెరటం నీవు


ఆకారం లేని అద్భుతానివి

వికారాలకు చిరునామా నీవు

ఓ మనసా.. నీవేప్పుడు వశమౌతావు?




Rate this content
Log in

Similar telugu poem from Classics