మనసు
మనసు
ప్రేమమంచు శిల్పమేగ..అందమైన మనసు..!
చెలిమిపూల తల్పమేగ..నిత్యమైన మనసు..!
స్వచ్ఛమైన మధుమాసం..దరహాసం మాటు..
చెలిచూపుల రాగమేగ..గేయమైన మనసు..!
పయనించు మేఘమాల..సోయగాలకేమి..
మెఱుపుపూల భోగమేగ..భావమైన మనసు..!
ఆటాడే సూరీడే..లేడన్నది నిజము..
కీచురాళ్ళ నాట్యమేగ..చోద్యమైన మనసు..!
అనుమానపు పడవతోటి..చేరేదే ఒడ్డు..
కడలిగర్భ శోకమేగ..జాఢ్యమైన మనసు..!

